మాతృ దినోత్సవం క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్
కాకినాడ జిల్లా జగ్గంపేట: (అఖండ భూమి) జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన మాతృ దినోత్సవం గుర్రంపాలెం గ్రామంలో పాస్టర్ సజ్జ జాన్ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా వృద్దురాలైన సంతోషమ్మ నీ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరు అందించలేని ప్రేమను తల్లి అందిస్తుందని తల్లి తల్లిగా అక్కగా చెల్లిగా , భార్యగా మరియు అమ్మమ్మగా ఇలాగ అనేక రకాల పాత్రను పోషిస్తూ జీవన విధానంలో పిల్లలను పెంచడానికి అనేక సందర్భాలలో కష్టపడుతూ తాను తిన్న తినకపోయినా పిల్లలు భర్త కొరకై తన ప్రాణాలను అర్పించిన మాతృ దేవత తల్లి అని అలాంటి తల్లిని మనం ఎంతో గౌరవించాలని ఇటువంటి అవకాశం కల్పించిన క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రాజేష్, ప్రసాద్, నూకరాజు కరుణ కుమార్, ఆదిత్య, షాలేం తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



