దుర్గామాతకు ఏ రోజు ఏ ప్రసాదం సమర్పించాలి..?
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 22 ,(అఖండ భూమి న్యూస్)
అమ్మవారికి ఏ అభిషేకం ఏ నైవేద్యం పెట్టాలి?
పాడ్యమి రోజు.ఆవు నేయితో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి. విదియ రోజు. చక్కెర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది. తదియ రోజుఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి. చవితి రోజున పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి. పంచమి రోజు.అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు, బుద్ది శక్తి పెరుగుతుంది.“`
షష్టి రోజున తేనేతో అమ్మ వారిని అభిషేకించి ,బ్రహ్మణు నికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది అష్టమి రోజున. బెల్లం నీటితో అభిషేకించి, మంచిబెల్లం ఎవరికయినా దానం ఇవ్వటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివిఅన్నీ తీరిపొతాయి అంటారు. నవమి రోజున.నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.“`
దశమి రోజున.నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది. వారాలలో ఏ నైవేద్యం ఆదివారం రోజు పాలు, సోమవారం పాయసం,
మంగళవారం అరటిపళ్ళు,
బుధవారం వెన్న,గురువారం పటికబెల్లం,శుక్రవారం తీపి పదార్ధాలు,శనివారం ఆవు నేయి, అమ్మవారికి ఇష్టమయిన అన్నం పులగం అన్నం పెస రపప్పు కలిపి పాయసాన్నం
పెరుగు ,అన్నం,బెల్లం అన్నం
నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తిన్నట్టు, అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూ డదు.“అమ్మవారికి పూజ ఎలా చేయాలి. ఆచమనం ముందు చేయాలి.కాల స్మరణ చేయాలి. సంకల్పం చెప్పు కోవాలి,అభిషేకం చేయాలి.
మామిడి రసం, చూత పళ్ళుతో అభిషేకం చేయటం వలన సరస్వతి ఆఇంటి ని విడిచి వెళ్ళదు, ఆ ఇంట్లో వుండే వారి కీ సరస్వతి కటాక్షం ఉంటుంది..
ఆవు నేయి తో అభిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి, పెరుగుతో అభిషేకం వలన సంపదలు కలుగుతాయి. అమ్మవారికి చాలా ప్రీతిగా ఉంటారు, సకల రోగాలు పోతాయి,
తేనే తో అభిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది, ఆవు పాల తో అభిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి, సకల శుభాలు కలుగుతాయి.
గంధం తో అభిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది, పసుపు తో అభి షేకం చేయటం వలన సౌభగ్య మ్ పెరుగుతుంది.అమ్మవారిని 108 పువ్వులు తో పూజచేయ డం విశేషం. కమలాలు, జాజి పువులు, లేత బిల్వాలు సకల సంపదలు కలుగుతాయి,
దాడిమి పువ్వులు అంటే దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా వేరుగా ఉంటాయి వాటి తో,మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం.ఇవన్నీ భక్తి భావంతో మనము ఏర్పరచుకున్నవే ఆ తల్లికి భక్తిగా ఎలా పూజించిన లోటు ఎంచదు చదన్నం నాకు ప్రీతి అని పేదవారు ఇంట్లో చద్దిబువ్వ తిని వారిని కరు ణించే తల్లి ఆడంబరాలు తిధి ప్రకారం లెక్కపెట్టుకుని చేసే పూజలకు కాదు ప్రసన్నం కాదు మనసుతో చేసే నిత్య ఆరాధన అర్చనకు ప్రసన్నంఅవుతుంది ,
మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన తృప్తి కోసం మన కు ఆ తల్లి పట్ల ఉన్నశ్రద్ధఆప్యా యత ఆశ ఆ తల్లి సన్నిధిలో సేవ చేస్తూ సమయం గడపటం కోసం మానసికంగా బాహ్యంగా కూడా ఆమె సన్నిధిలో కాసేపైనా ప్రాపంచిక విషయాలు మరచి నివశించడం కోసం ఇవన్నీ ఆచరిస్తూ ఆ తల్లిని పూజిస్తున్నాము. కానీ ఆమె మన నుండి మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారానికి ప్రసన్నం అయిపోతుంది.
ఉదాహరణకు మీ ఇంట్లో చంటి బిడ్డ ఇది కావాలి అని అడగలేడు కానీ మీరు ఎన్నో రకాలుగా అలంకారం చేసి మురిసిపోతారు మీరు చేయ కపోయినా వాడు నోరు తెరచి అడగలేడు, అలంకరించి దిష్టి చుక్క పెట్టుకుని పదే పదే చూసుకుని మురిసిపోతారు ఆ బిడ్డ నుండి ఏదీ ఆశించరు. అది మీస్వచ్ఛమైన ప్రేమ ,భక్తుడికి భగవంతుడు పైన కూడా అటువంటి ప్రేమే ఉంటుంది ఉండాలి అదే నిజమైన భక్తి. ఇది సంప్రదాయం మాత్రమే.
You may also like
గ్రాడ్యుయేషన్లు జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలి…
నాసిరకం నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్లపై చర్యలు తీసుకోవాలి…
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…