చుక్కాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను పరిశీలించిన కలెక్టర్….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 23 (అఖండ భూమి న్యూస్) మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చుక్కాపూర్ ఆయుశ్మాన్ ఆరొగ్య మందిర్ ( ఆరోగ్య ఉప కే0ద్రం ) ను అకస్మిక తనిఖీ చేసినారు. ఈ ఈ తనిఖీలో ఈ కే0ద్రంలో అందుతున్న ఆరొగ్య సేవల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కే0ద్రంలో వసతులు మెరుగు పర్చాలని సుచించారు. నీటి సరఫరా వసతి కల్పించడానికి తగు ఏర్పాట్లు చేయాలని స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఆదెశించారు. ఆయుశ్మాన్ ఆరొగ్య మందిర్ లో రోజుకి ఎంత మంది రోగులు వస్తారు, ఎంత మంది గర్భిణీ లకు పరీక్షలు చేస్తున్నారు అని ఆరా తీశారు. గర్భిణీ పరీక్షల కోసం కావలసిన ఎక్సామినేషన్ మంచాలు / టేబుల్స్ ఆయుశ్మాన్ ఆరొగ్య మందిర్ లో అందుబాటులో లేని విషయం గమనించిన కలెక్టర్ జిల్లా వైద్య మరియు ఆరొగ్య శాఖాధికారిని అడుగగా అవి సరఫరా లేవని తెలుపగా మొత్తం ఎన్ని ఆయుశ్మాన్ ఆరొగ్య మందిర్ లకు మంచాలు / టేబుల్స్ అవసరం అవుతాయో ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్య మరియు ఆరొగ్య శాఖాధికారిని ఆదేశించినారు. గ్రామం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మరియు డెంగ్యూ తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ తనిఖీలో జిల్లా వైద్య మరియు ఆరొగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్ , జిల్లా ఉప వైద్య మరియు ఆరొగ్య శాఖాధికారి డా. ప్రభు దయా కిరణ్ , వైద్య అధికారి డా. ఆదర్శ్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం