బస్తీ దావఖానాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 24 (అఖండ భూమి న్యూస్) బస్తీ దవాఖాన ద్వారా నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ తో కలిసి కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడ బస్తీ దవాఖానను సందర్శించి బస్తీ దవాఖానాలో అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి వైద్యులు మరియు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బస్తి దావకానకు వచ్చినటువంటి రోగులను బస్తీ దావకానాలో అందుతున్నటువంటి సేవలను అడిగి తెలుసుకుని వారికి బస్తీ దవాఖాన యొక్క ప్రాధాన్యతను వివరించి ఎలాంటి వైద్యసేవలు అవసరమైన తక్షణమే బస్తీ దవాఖానను సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. అలాగే అధిక వర్షాల వలన సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రితో పాటు ఆసుపత్రి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
బస్తీ దవఖానకు పక్కన నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణం పరిశీలించి నాణ్యతగా, వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి తాహసిల్దార్ జనార్ధన్ తదితరులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


