పొంచి ఉన్న మరో వాయుగుండం 26, 27 తేదీల్లో అతి భారీ వర్షాలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 24 (అఖండ భూమి న్యూస్) బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈనెల 27, 28 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ ప్రకటించింది. 25న ఏర్పడే అల్పపీడనం వాయుగుండం గా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 26న వాయుగుండం గా మారి దక్షిణ ఒడిశా,, 28న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు హనుమకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట్, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల 10 నుండి 20 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూల్చే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. 27న కొమురం భీమ్, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



