దారి మల్లుతున్న యూరియా
– చోద్యం చూస్తున్న వ్యవసాయ అధికారులు
– యూరియా సరిపడా అందుబాటులో ఉంచాలని డిమాండ్
ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వనం సుధాకర్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 24. (అఖండ భూమి న్యూస్) రైతుల పంటల ప్రయోజనార్థం వస్తున్న యూరియా బ్లాక్ కు తరలిస్తూ కొందరు ప్రైవేట్ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారని, ఇదంతా చూస్తూ వ్యవసాయ అధికారులు చూసినట్లు వ్యవహరిస్తున్నారని ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ ఆరోపించారు. ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పంటల అదును దాటిపోతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కావడం లేదని ఒకవైపు రైతు తీవ్ర కష్టాల్లో ఉంటే వారిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రైవేట్ డీలర్ల చేతుల్లోకి వెళ్లిన యూరియాకు అదనంగా రేటు పెంచుతూ లింకులు అంటగడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ జిల్లా నాయకులు నర్సింలు రమేష్ తదితరులు పాల్గొన్నారు .
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



