దాబాలలో మద్యం అమ్మడం, సెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్పీ రాజేష్ చంద్ర…

దాబాలలో మద్యం అమ్మడం, సెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్పీ రాజేష్ చంద్ర…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 24 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లాలో దాబాలలో మద్యం అమ్మడం కానీ, నేరామైన చర్యలుగా పరిగణించి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజచంద్ర బుధవారం అన్నారు. జిల్లాలోని బీచ్కుంద మండలంలోని కథలాపూర్ గ్రామ శివారులో గల 36 ధాబా యజమాని బలిజ గంగాధర్ ఎలాంటి పర్మిషన్ లేకుండా తన దాబాల మద్యం విక్రయాలు, సిట్టింగ్ నిర్వహించడంపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసి బీచ్కుంద తాసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. అక్రమంగా సిట్టింగులు నిర్వహిస్తున్నా దాబా యజమానిపై 50వేల జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఒకసారి బైండోవర్ చేసిన తర్వాత బైండోవర్ చేసిన అనంతరం ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జరిమానాలతోపాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపి సిట్టింగులు నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!