జాయ్ హన్మాండ్లు .. జర్నలిస్ట్ జీవిత గాథ స్పెషల్ స్టోరీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 25 (అఖండ భూమి న్యూస్) నేటి తరానికి బహుశా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోయినా, 1970–80 దశకంలో జాయ్ హన్మాండ్లు అంటేనే పత్రికా లోకానికి గౌరవం, అంకితభావం, నిజాయితీ గుర్తొచ్చేవి. గత మూడు రోజుల క్రితం 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన ఆయన పత్రికా రంగానికి చేసిన సేవలు మరువలేనివి.
జాయ్ హన్మాండ్లు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ, తన హృదయానికి దగ్గరైన విలేఖరి వృత్తిని ఎంచుకున్నారు. ఆ కాలంలో మామగారి ప్రేరణతోనే ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కలం పట్టారు. నిజాన్ని వెలుగులోకి తేవడం, సమాజ సమస్యలను అధికారుల ముందుంచడం, వెనుకబడిన వర్గాల కష్టాలను పత్రికల్లో రాయడం ఆయన జీవిత ధ్యేయంగా మారింది.
అనేక పత్రికల్లో ఆయన పనిచేశారు. ప్రతి పత్రికలోనూ తనదైన ముద్ర వేశారు. ఆ రోజుల్లో సాంకేతిక సౌకర్యాలు లేని సమయంలోనూ కష్టపడి సమాచారాన్ని సేకరించి, స్పష్టమైన శైలిలో ప్రజల ముందుకు తీసుకురావడంలో ఆయనకున్న కృషి విశేషం. ఆయన రాసిన వ్యాసాలు కేవలం వార్తలు మాత్రమే కాదు, సమాజానికి మార్గదర్శకాలు.
సాధారణ జీవనం గడిపిన జాయ్ హన్మాండ్లు విలేఖరి వృత్తిని వాణిజ్యకరంగా కాకుండా బాధ్యతగా తీసుకున్నారు. పత్రికా రంగంలో కొత్తగా అడుగుపెట్టిన అనేక మంది యువ విలేఖరులను ప్రోత్సహించి, మార్గనిర్దేశనం చేశారు.
ఈ రోజు ఆయన లేరన్న వార్త పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన జీవిత గాథ, ఆత్మనిబ్బరం ఈ తరం జర్నలిస్టులకు ఆదర్శం.జాయ్ హన్మాండ్లు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిద్దాం.
You may also like
ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గులు వేసిన సర్పంచ్ ఐరేని నరసయ్య…
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.



