కొనసాగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 25 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లాలోని బిబిపేట మండలం జనగామ గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా దీక్ష తీసుకొనీ మాలధారణ చేసిన స్వాములు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత అయినటువంటి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా దుర్గామాత సెట్టింగ్ ఏర్పాటు చేసి ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరీ బాపురెడ్డి, డాకూరి ప్రవీణ్ కుమార్, శివరాత్రి రామచంద్రం, శివరాత్రి లక్ష్మీనారాయణ, మోకాళ్ళ హనుమంత రెడ్డి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


