కిరాణ దుకాణాల్లో తగ్గని జిఎస్టి ధరలు..!
ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జీఎస్టీని ఖాతరు చేయని వ్యాపారులు..
లబోదిబోమంటున్న వినియోగదారులు..
పట్టించుకోని అధికారులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 25 (అఖండ భూమి న్యూస్) కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతి నిరుపేదలకు ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీఎస్టీని తగ్గించి ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకువచ్చింది. నిత్యవసర వస్తువులలో నిర్ణీత ధరల్లో అమ్మాల్సిన వ్యాపారులు ప్రస్తుతం ఈనెల 22 తేదీ నుండి అమల్లోకి వచ్చింది. కానీ ప్రస్తుతం కిరాణ దుకాణాలలో జిఎస్టి కి విరుద్ధంగా పాత పద్ధతిలోనే అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఇదేంటి జీఎస్టీ తగ్గింది కదా అని వినియోగదారులు ప్రశ్నిస్తే ఇది పాత స్టాకు అనే సాకుతో నిత్యావసర వస్తువులు వినియోదారులకు కట్టబెడుతున్నారు. గ్రామీణ, తండాల, పల్లె ప్రజల అమాయకులను ఆసరా చేసుకొని నిత్యావసర వస్తువుల పేరుతో వ్యాపారులు అందినంత దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువులే కాకుండా ఇతర వ్యాపారులు సైతం జీఎస్టీ అమలును పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. జీఎస్టీ అమలు కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు వరంగా ఉండాలని ఉద్దేశంతో అమలు చేస్తే వ్యాపారులు వినియోగదారులను అడుగడుగునా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా శాఖల అధికారుల సైతం జిఎస్టి అమలును పకడ్బందీగా అమలు చేసే విధంగా దృష్టి కేంద్రీకరించకపోవడంతో తక్కువ ధరలకు దిగుమతి చేసుకున్న వస్తువులను అధిక ధరలకు విక్రయించి ధనార్జనే ధ్యేయంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. వినియోగదారులకు జిఎస్టిని ఆయా దుకాణాలలో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక వ్యాపారులకు ఇష్టారాజ్యంగా మారింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినప్పటికీ జీఎస్టీ ధరల అమలు పట్టికలు లేకుండా దానిపై ఎమ్మార్పీ రేట్లు లేకుండానే విక్రయాలు జరుపుతున్నారు. దీనిపై అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకొని సామాన్యునికి ప్రభుత్వాలు అందించే రేట్లలో నే వ్యాపారాలు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా ప్రజలు కోరుతున్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



