భారతీయ జనసంఘ్ స్థాపకు డు, మార్గదర్శి దీన్ దాయల్ ఉపాధ్యాయ జయంతి..

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 24,(అఖండ భూమి న్యూస్) ఆయన ఒక మార్గదర్శి, తాత్వికుడు, భారతీయ ఆత్మ
భారత రాజకీయాల్లో దీన్ దాయల్ ఉపాధ్యాయ ఒక్క గొప్ప తాత్వికుడు ,జర్నలిస్ట్, రచయిత ,రాజకీయ నాయకుడు మానవతా వాదీ ఆయన రూపొందించిన అంత్యోదయ సమాజంలో చివరి వ్యక్తి కూడా ఫలాలు అందే తాత్వికత మీద ఆధారపడి ఉంది. ఆయన పాచ్చత్య పెట్టుబడిదారి విధానం కమ్యూనిస్టు విధానం కాకుండా మానవుడు కేంద్ర బిందువుగా వుండే భారతీయ విలువల ఆధారంగా రూపొందించారు. వ్యక్తి, సమాజం ,ప్రకృతి మధ్య సమతుల్యత అవసరం అనిగట్టిగా నమ్మినారు. సమాజం మొత్తం ప్రయోజనం అంటే చివరి వ్యక్తి వరకు అది చేరాలని ఆయన విశ్వాసం. ఆయన పుట్టినప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి కూడా అధైర్య పడ కుండా పదవ తరగతి,ఇంటర్ లో గోల్డ్ మెడల్ సాధించి ఉపాకరవేతనాలతోనే ఆగ్రా, అలహాబాద్ విశ్వవిద్యాలయల్లో ఉన్న త విద్యను పూర్తి చేశారు. సెప్టెంబర్ 25,1916 లో ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలోని నాగ్ల చంద్రబాన్ అనే గ్రామం లో జన్మించారు. రాజకీయ ప్రస్థానం ఆయన చిన్ననాటి నుండే ఆర్.ఎస్.ఎస్ కు ఆకర్షితుడు అయ్యారు. జంసంఘ్ స్థాపన లో క్రీయాశీలంగా వ్యవహరిం చారు. 1951 లో దాని ప్రధాన ఆలోచన ధోరణికి మార్గదర్శిగా, సిద్ధాంత కర్తగా మారిపోయాడు. 1967 లో జనసంఘ్ అధ్యక్షుడు గావ్య వహరించారు ప్రస్తుత బి.జె.పి కి.మూలం జంసంఘ్.ఆయన గొప్పరచయిత, రాష్ట్ర ధర్మ, ఇంటిగ్రల్ హ్యుమనిజం జనతా పత్రిక సంపాదకులుగా తన సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు ఆయన కథలు నవలలు కూడా రాశారు. సాహిత్యరంగం లోను ముద్రవేశారు.ఆయన మరణం ఇప్పటికి మిస్టరీ గానే ఉంది. 1968 ఫిబ్రవరి11 రాత్రి ముఘల్సరాయి రైల్వే స్టేషన్లో మరణించారు. భారత దేశం లో పలు సామాజిక సంక్షేమ పథకాలు ఆయన పేరు మీదుగా కొనసాగుతున్నాయి. ధీన్ దయల్ అంత్యోదయ యోజన,విద్యాసంస్థలు రహదారులు, రైల్వే స్టేషన్లు ఆయన పేరుమీ ద ఉన్నాయి. దీన్ దయాల్ ఉపాధ్యాయ కేవలం రాజకీయ వ్యక్తి మాత్రమే కాదు భారతీయ తత్వశాస్త్రం సంస్కృతి ఆధారంగా సమాజ నిర్మాణానికి కృషి చేసిన దార్షా నికులు ఆయన చూపించిన అంత్యోదయ మార్గ దర్శకత్వం నేటికీ ప్రేరణగా నిలుస్తుంది. ఆయన జీవితం దేశభక్తి, త్యాగం ,సాదాసీదా జీవనానికి నిదర్శనం రాజకీయాలను పక్క న పెడితే ఆయన ఆలోచనలో నే ఉంది చివరి వ్యక్తి వరకు ప్రయోజనాలు అందితేనే అది అంత్యోదయ మవుతుందని అనేది నూరు శాతం నిజం.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


