భారతీయ జనతా ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

భారతీయ జనతా ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

బెల్లంపల్లి సెప్టెంబర్ 25(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి పట్టణంలోనీ 86.బూత్ పరిధి హనుమాన్ బస్తీలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు అన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ జన సంఘ మొదలై జనతా పార్టీగా రూపుదిద్దుకుంది.ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పరిపాలనలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాస కమల,పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్,ఎర్రోజు శ్రీనివాస్,తోటపల్లి ఓం సాయి,గౌస్ షేక్ బాబా,గర్రెపల్లి రాకేష్, మధు, శీను కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!