ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26 (అఖండ భూమి న్యూస్) వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని అండ్ బి కార్యాలయం సమీపంలోని
చాకలి ఐలమ్మ విగ్రహం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఇలమ్మ జయంతి ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటానికి ప్రతీక అని బహుజన సమాజానికి ధైర్యం, పోరాటస్ఫూర్తి నింపిన మహనీయురాలు. ఆమె త్యాగం, వీరస్వభావం తరతరాలకు ఆదర్శం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ , సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, రాజయ్య, శ్రీకాంత్, స్వామి, పవన్, అశ్వక్, నరేష్, టి ఎన్ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు, బీసీ సంఘం నాయకులు శివరాములు, శంకర్, రజక సంఘం నాయకులు, జిల్లా అధికారులు మరియు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



