స్పెషల్ డ్రైవ్ ద్వారా 157 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ…

స్పెషల్ డ్రైవ్ ద్వారా 157 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ…

– బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు..

-జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర, వెల్లడి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26. (అఖండ భూమి న్యూస్);

 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి గురైన 157 మొబైల్ ఫోన్లను ( సుమారు 25 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలన్నారు. సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ తీసుకోవాలన్నారు. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు సిఈఐఆర్ వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులబంగా దొరికే అవకాశం ఉందన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ (బాలరాజు), 06 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. గత (7) రోజులలో ఈ టీం అధికారులు 157 ఫోన్ లను రికవరీ చేయడం , ఇప్పటి వరకు ఈ టీం అధికారులు 938 ఫోన్ లను రికవరీ చేయడం జరిగిందన్నారు. సిఈఐఆర్ పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 3862 ఫోన్ లను రికవరీ చేయడం బాధితులకు అందజెయడం జరిగింది. ఈ సందర్భంగా 157మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సభ్యులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు సమాచారం అందించడం జరుగుతుందన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!