జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26. (అఖండ భూమి న్యూస్) చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, మాట్లాడుతూ –
“చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక. ఆమె బానిసత్వాన్ని బద్దలుకొట్టి సమాజానికి చైతన్యం అందించిన వీరనారి” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, ఆర్.ఐలు నవీన్, కృష్ణ, పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


