తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ విద్యార్థిని గ్రూప్ వన్ కు ఎంపిక …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26 (అఖండ భూమి న్యూస్) తెలంగాణ విశ్వవిద్యాలయం, సౌత్ క్యాంపస్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శ్రీజ గ్రూప్ 1 లో విజయం సాధించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రాధిక -జైపాల్ రెడ్డి ల కుమార్తె కంకణాల శ్రీజా రెడ్డి మొదటి ప్రయత్నంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్- 1 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 509 ర్యాంక్ ను సాధించి, మల్టీ జోన్ 1 కు ఎంపీడీవో గా ఎంపిక అయ్యింది. క్యాంపస్ లోని ప్రశాంతమైన వాతావరణం, అధ్యాపకుల సూచనల తో ఈ విజయం సాధించానని శ్రీజ అన్నారు.
ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్, మరియు డిపార్ట్మెంట్ అధ్యాపకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీజ ని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో విద్యార్థులు మరిన్ని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ సహకారంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సౌత్ క్యాంపస్ అధ్యాపక బృందం , మరియు విద్యార్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



