విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ 

 

కర్నూలు మే 15, (అఖండ భూమి) : స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని పుడ్ కార్పోరేషన్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని నందవరం మండలం కు చెందిన కర్రెన్న ఫిర్యాదు చేశారు.

కొద్ది రోజులుగా భర్త కనిపించడం లేదని ఆచూకి తెలియజేయాలని కర్నూలు మండలం, నూతన పల్లె గ్రామానికి చెందిన వరలక్ష్మీ ఫిర్యాదు చేశారు. మరిది , అత్త అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని కర్నూలు కు చెందిన జె. రేఖాదేవి ఫిర్యాదు చేశారు.

మా నాన్న చనిపోవడంతో అద్దెకు ఉన్న వ్యక్తి మా ఇంటిని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని కర్నూలు, ఆరోరా నగర్ కు చెందిన గౌసియా ఫిర్యాదు చేశారు.

ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో సూపర్ వైజర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళ డబ్బులు తీసుకోని మోసం చేసిందని మంత్రాలయం మండలం, నారాయణ పురం గ్రామానికి చెందిన రాజు ఫిర్యాదు చేశారు. నా పై దాడి చేసి గాయపరిచిన వారి పై చర్యలు తీసుకోవాలని దేవనకొండ మండలం, తెర్నెకల్లు గ్రామానికి చెందిన ముగతాళి సుధాకర్ ఫిర్యాదు చేశారు.

స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీ నాగభూషణం, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!