తుగ్గలి మే 15 అఖండ భూమి పత్తికొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కెఈ. శ్యాంబాబు సోమవారం పత్తికొండ మండలంలో చేపట్టిన పాదయాత్రకు తుగ్గలి మండలం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్ర వంద రోజులు పూర్తి కావడంతో సంఘీభావంగా కేఈ. శ్యాం బాబు పాదయాత్ర చేపట్టారు. దీంతో మండలం నుండి టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు, మహిళా అధ్యక్షురాలు రాతన ఈరమ్మ లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తుందన్నారు. అలాగే కె.ఈ శ్యాంబాబు చేపట్టిన పాదయాత్ర కూడా భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు వెంకటపతి, బర్మా వీరేష్ సోమశేఖర్ గౌడ్, వెంకట్రామ్ చౌదరి , ఎద్దులదొడ్డి శ్రీనివాసులు గౌడ్, రాముల విజయ్ , లక్ష్మణ్ స్వామి, రవి, సంఘాల కృష్ణ, కడమ కుంట్ల పకీరప్ప ,చాంద్ బాషా, కూసినేని రవి, రాంపల్లి సుభాష్, శభాష్ పురం మోహన్ శ్రీరాములు, తులసి నాయక్, తుగ్గలి వల్లే వెంకటేష్ ,గిరిగేట్ల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్(15 తుగ్గలి03) పాదయాత్రలో మాట్లాడుతున్న మహిళా అధ్యక్షురాలు రాతన ఈరమ్మ


