తుగ్గలి మే 15 అఖండ భూమి వెబ్ న్యూస్ :
మండలం పరిధిలోని పగిడిరాయి గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి రథోత్సవం సందర్భంగా సోమవారం గ్రామ పెద్దలు నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు రసవత్తంగా జరిగాయి. ఈ పోటీలను మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి, ఎంపీపీ గౌరవ సలహాదారుడు అనుమరాజు రంగన్న, సర్పంచ్ గౌరవ సలహాదారుడు హనుమంతు లు ప్రారంభించారు.ఈ పోటీలలో విజేతులను వృషభ యజమానులకు మొదటి బహుమతి రూ 25వేల నగదును వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి అందజేశారు. అలాగే రెండవ బహుమతి ఎంపీపీ గౌరవ సలహాదారుడు హనుమ రాజు రంగన్న రూ 20 వేలు, మూడో బహుమతి రూ 15 వేలు సర్పంచ్ గౌరవ సలహాదారుడు హనుమంతు, నాలుగో బహుమతి రూ 10 వేలు కాయల రంగన్న ,ఐదో బహుమతి రూ 7016 లు లాల్ స్వామి ,ఆరో బహుమతి రూ 5016 లు వడ్ల ఆచారి లు అందజేశారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో జరిగిన జాతరకు హాజరయ్య బంధుమిత్రులకు వినోదం కలిగించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఫోటో రైట్ అప్ (15 తుగ్గలి01) రాతి దూలం లాగు పోటీలను ప్రారంభిస్తున్న మాజీ జడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి



