పని ప్రదేశంలో నీడ,నీరు ఏర్పాటు చేయాలి:-గిరిజన ఉపాధి కూలీలు. సుస్థిర ఆస్తులు,వలసల నివారణయే ఉపాధి హామీ లక్ష్యం:నీడ్స్ సంస్థ రాష్ట్ర కన్వీనర్ ఆర్.లక్ష్మణ్.
అల్లూరు జిల్లా: అనంతగిరి ( అఖండ భూమి) మే15: మండలంలోని కివర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబందించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా ఈ ఏడాది వంద రోజులు పని దినాలు ప్రభుత్వం కల్పించటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఉపాధి హామీ ఏపిఓ అర్జున్ తెలిపారు.అలాగే సోమవారం నాడు కివర్ల పంచాయతీ పరిధిలో గల టెంకల వలస గ్రామానికి చెందిన జన్ని కొండబాబు కు సంబందించి రోడ్డుకు అనుకోని ఉన్న పొలంలో గిరిజన ఉపాధి వేతనదారులు భూమి చదును పనులు చేస్తుండగా నీడ్స్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు,సిసిఆర్ జిల్లా సెక్రటరీ, జై భారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.లక్ష్మణ్ పని ప్రదేశంలో సందర్శించి కూలీల సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసు కున్నారు.అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు వలసల ద్వారా కూలీ పనులకు వెళ్లకుండా సొంత గ్రామంలో ఉపాధి హామీ పధకం ద్వారా వంద రోజులు పనిని అందరూ సద్వినియోగం చేసుకొని తద్వారా గ్రామాల్లో స్థిర ఆస్తులు పెంచుకుంటూ, భూగర్భ జలాలు పెంపోదిం చేదుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని ఉపాధి హామీ పధకాన్ని గిరిజన రైతులు అందరూ సద్విని యోగం కోవాలని తెలియజేసారు.
ఈ సందర్బంగా ఉపాధి వేతనదారులు మాట్లాడుతూ… ఇప్పటికే నాలుగు వరాలు పని చేశామని వారానికి ఒకొక్కరికి పదిహేను వందలు పైబడి వేతనాలు తమ,తమ ఖాతాలలో జమ అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు, అలాగే ఎండ చాలా ఎక్కువగా వుందని నీడ, మంచినీళ్లు ఏర్పాటు చేయాలనీ,గునపం, పారలు అందించాలని వారు ఈ సందర్బంగా సంబందింత సిబ్బంది కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



