గ్రామాల్లో పెరిగిన పోటీ చేసే నాయకుల సందడి..!

గ్రామాల్లో పెరిగిన పోటీ చేసే నాయకుల సందడి..!గ్రామాల్లో పెరిగిన పోటీ చేసే నాయకుల సందడి..!

ఎన్నడూ లేనివిధంగా పల్లెల్లో పలకరింపులు,..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);

నమస్తే బాబాయ్, అన్నా బాగున్నావా, అక్క బావ తిన్నాడా , చెల్లెమ్మ బీడీల పింఛన్ వస్తుందా? అంటూ ఎన్నడు లేని విధంగా గ్రామాల్లో కొత్త పలకరింపులతో ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీ చేసే నాయకులు, ఆశావహులు పల్లెల్లో పలకరింపులతో ఎన్నికల సందడి కొత్త జోస్ సంతరించుకుంది. కోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్టే వస్తుందని అనుకున్న నాయకులు వచ్చే నెల 8 వరకు తీర్పును వాయిదా వేయడంతో గ్రామాల్లో గడువులోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరగడంతో ఎక్కడ లేని విధంగా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ పలకరింపులు మొదలయినాయి. ఆయా పార్టీల ఆశావాహ నాయకులు తన వైపు ఓటర్లను తిప్పుకోవడానికి కొత్త స్టైల్ లో కొత్త పలకరింపులు మొదలయినాయి.

రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం జీవో విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది.

అయితే, శనివారం (సెప్టెంబరు 27 ఉదయం నుంచి రిజర్వేషన్లు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

కాగా, కామారెడ్డి జిల్లాలోని 25 మండలాలకు సంబంధించిన ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల డ్రా ప్రక్రియను పలు రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ డ్రా పద్ధతిలో ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఆయా స్థానాల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారు పార్టీ టికెట్పై ఎమ్మెల్యేల వద్దకు పరుగులు పెడుతున్నారు.

మరికొందరు నిరాశలో ఉండిపోయారు. ఎందుకంటే వారి ప్రాంతాల స్థానాలను వేరే కేటగిరీకి కేటాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

మార్పించుకునే అవకాశం ఏమైనా ఉందా.. అంటూ ఆరా తీస్తున్నారు. వీరు కూడా స్థానిక ఎమ్మెల్యేల భేటీ అయ్యేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

మహిళలకు 50 శాతం..

అధికారిక రిజర్వేషన్ల జాబితాను శనివారం రాత్రి అధికారులు వెల్లడించారు.

అక్టోబర్ 8 లోపు లోపు ఎన్నికలు పూర్తి చేస్తారని జోరుగా ప్రచారం…

అక్టోబర్ 8వ తేదీ లోపు ముందస్తుగా ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు పూర్తి చేస్తారని పల్లెలో జోరుగా ప్రచారం జరగడంతో ఆయా పార్టీలకు చెందిన ఆశావాహులు ఆయా పార్టీలను సంప్రదిస్తున్నారు. తనకు ఎలాగైనా పార్టీ దీపములు ఇవ్వాలని అధిష్టానం ముందు మొరపెట్టుకుంటున్నారు. మరికొంతమంది తమ స్థానాల్లో అత్యధికంగా ఉన్న సామాజిక కూలవర్గాలను దృష్టిలో ఉంచుకొని మెజార్టీ ఓటర్లు ఉన్న సామాజిక కులవర్గాలకు బీఫాంలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

Akhand Bhoomi News

error: Content is protected !!