లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉందాలంటే ఏం చేయాలి…

లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉందాలంటే ఏం చేయాలి…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు

వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29,(అఖండ భూమి న్యూస్);

డబ్బుకు లోకం దాసోహం అని అంటారు మన పెద్దలు కానీ. అలాంటి డబ్బు మన ఇంట్లో ఎల్లప్పుడు ఉండాలంటే మన కు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు. మనం చేసే పనులు, మన ప్రవర్తన ను బ ట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరిలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటిం చాలి. అవేంటంటే. శ్రీ లక్ష్మీ కటాక్షం కోసంసూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టా లి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలు పులు తెరవాలి. మంగళ, శుక్ర వారాల్లో పంచముఖ దీపాల ను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మల్లో చేసిన పాపాలు హరింప బడతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని పురాణాల్లో వివరించబడింది.

అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రిభోజనం తీసుకోవాలి. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవా రికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రల ను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో వున్న వెండి పాత్రలను తన సంతా నానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు.

అయితే ముఖ్యంగా అసత్యా లు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారి వద్దలక్ష్మీదేవినివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిర గాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్ళి కాళ్ళను శుభ్రం చేసు కోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాస ముండదు. తల్లిదండ్రులను లెక్క చేయని వారింట, గోళ్లు కొరికే వారింట శ్రీలక్ష్మీదేవి నిలు వదని పురోహితులు అంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!