ఈతకోట గ్రామంలో ఆరోగ్య సేవా కేంద్ర వద్ద వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన

స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
రావులపాలెం. ఆరోగ్య కేంద్ర వద్ద నిర్వహించిన స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలోని మెయిన్ రోడ్డులో ఉన్న భారత ఆరోగ్య సేవా కేంద్ర వద్ద బుధవారం నాడు ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్య శిబిరంలో మహిళలు గర్భిణీనిలు బాలింతలకు ప్రజలకు వైద్యులు పలు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలువురికి మందులను అందజేశారు గర్భిణీ స్త్రీలకు సీమాంతాలు నిర్వహించారు ఈ యొక్క ఆరోగ్య శిబిరంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు.ఎన్డియే కూటమి నాయకులు
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతీ మహిళా ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటించాలన్నారు మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా శక్తివంతంగా ఉంటుందన్న సదుద్దేశంతో మహిళలు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వారి శ్రేయస్సు కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎంతో అత్యంత ప్రతిష్టాత్మంగా
తీసుకుని ఈ మహోత్తరం కార్యక్రమాలను నిర్వహిస్తున్నరన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరుకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహనా కల్పించడంతో పాటుగా ఆరోగ్యకరంగా ఉండేందుకు అనేక విధాలుగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలియజేశారు స్త్రీ ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఆయా గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ ఆరోగ్య శిబిరాల్లో ఆరోగ్య కేంద్రాలల్లో వైద్యులు ఆరోగ్య సేవల్ని అందిస్తున్నారన్నారు ప్రజలందరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ బి. సత్యనారాయణ.
కె. ఇందిర.ఎమ్ ఎల్ హెచ్ సుభాషిణి.ఎఎన్ ఎమ్ లు జి అమ్మాజీ.ముమ్మిడివరపు ఇందిర ప్రియదర్శిని.బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీరగోవిందరావు. తెలుగురైతు మండల అధ్యక్షులు యర్రంశెట్టి నాగేశ్వరరావు (బుజ్జి). తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మిరియాల రాము. జనసేన పార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి రాంమోహన్ రావు ( రాము).తెలుగుదేశం సీనియర్ నాయకులు మాసాబత్తుల ఆనందరావు. యార్లగడ్డ చిన్నియ్య.గ్రామస్తుడు ప్రజాసేవకుడు. గండ్రోతు దుర్గాసురేష్. దుక్కిపాటి లలిత. మల్లేశ్వరపు నాగలక్ష్మి. మేరీ.ఎమ్ మౌనిక. పి లావణ్య.హెల్త్ సిబ్బంది. ఆశా. అంగన్వాడీ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు. పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


