హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సురవద కార్యక్రమం

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సురవద కార్యక్రమం

 

ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి అక్టోబర్ 02(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాల గంగాధర్ తిలక్ స్టేడియంలో గురువారం విజయదశమిని పురస్కరించుకొని బెల్లంపల్లి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వద,కార్యక్రమాన్ని ఆంగ రంగ వైభవంగా కన్నుల పండుగల జరుపుకోవడం జరిగింది.చిన్నారులచే భారతనాట్య కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విచ్చేసారు.ఎమ్మెల్యే కు కమిటీ సభ్యులు శాలువ,పూలమాలతో ఘనంగా సన్మానిచ్చారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..బెల్లంపల్లి ప్రజలు ఇంత సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉందని,ఈ దసరా పండుగ అందరితో కలిసి జరుపుకోవడం మర్చిపోలేని విషయమని నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.నేను ఉన్నంతకాలం మీ అందరితో కలిసి దసరా పండుగలో పాల్గొంటానని అన్నారు.అలాగే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతి ఒక్కరికి పేరుపేరునా దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

అనంతరం మైదానంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి రావణాసుర వద కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా జరిగింది.ఈ కార్యక్రమానికి సుమారుగా 20,000 మంది ప్రజలు వచ్చారని అంచనా పోలీస్ వారు తగు బందోబస్తూ నిర్వహించి ఎలాంటి అవంచ నీయ సంఘటనలు జరగకుంట తగు బందోబస్తూ నిర్హహించారు…

Akhand Bhoomi News

error: Content is protected !!