త్రాగునీరు కోసం రోడ్డెక్కిన కామారెడ్డి డబ్బులు బెడ్ రూమ్ కాలనీవాసులు..!

త్రాగునీరు కోసం రోడ్డెక్కిన కామారెడ్డి డబ్బులు బెడ్ రూమ్ కాలనీవాసులు..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులకు గత నెల రోజులుగా త్రాగు నీరు రావడం లేదని డబల్ బెడ్ రూమ్ వాసులు సిరిసిల్ల బైపాస్ వద్ద ధర్నా శనివారం నిర్వహించారు. మున్సిపల్ డిఈ , ఎఈ రావాలని డబల్ బెడ్రూం కాలనీవాసులు పెద్ద ఎత్తున మహిళలు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి ఎస్సై రంజిత్ పోలీసులు అక్కడ చేరుకొని డిఈ, ఏఈలను రప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. డిఈ హనుమంతరావుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఈ హనుమంతరావు మాట్లాడుతూ. వారం రోజులలో నీటి సమస్యను పరిష్కరిస్తానని , బోరులో మోటర్ పెట్టిపించి నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!