సమాచార హక్కు చట్టం జాతీయ వార్షిక వారోత్సవాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలంలో గల చింతమన్ పల్లి గ్రామ శివారులో అమ్మా చాయ్ టీ, కాఫీ,హోటల్ ప్రాంగణంలో సమాచారకు చట్టం 2005 20వ వార్షిక జాతీయ వారోత్సవాలను సహ చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.
ఈ ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ. అక్టోబర్ 05-2025 నుండి అక్టోబర్ 12-2025 వరకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరంలో కూడా సమాచార హక్కు చట్టం 2005 జాతీయ వారోత్సవాలను నిర్వహించ బోతున్నామని తెలియజేశారు.
ఈ జాతీయ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణ రావు గారు కూడా ఒక ప్రత్యేక లేఖ U. O. Notice No: 8432/GPM&AR/2025. Dated:01-10-2025 ను అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించడం జరిగింది . ఈ లేక అనుసారంగా ప్రతి జిల్లాలో అక్టోబర్ 5 నుండి 12 అక్టోబర్ వరకు సమాచార హక్కు చట్ట వార్షిక వారోత్సవాలు నిర్వహించాలని తెలియజేసినారు.
ఇందులో భాగంగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ప్రతినిధులు ఆయా జిల్లా, మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు కేతు రమణారెడ్డి, ఇక శ్రీనివాసరావు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి ముహమ్మద్ జావిద్ ప్రతినిధులు శ్రీనివాస్ రాజు, లింగమయ్య, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.


