కత్తిపోట్లు కాదు – గాజు పెంకులు …

కత్తిపోట్లు కాదు – గాజు పెంకులు …

– పాత కక్షలుతోనే ఘటన

– రౌడీ షీట్లను బైండోవర్ చేస్తాం – కామారెడ్డి ఎ ఎస్ పి బి చైతన్య రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో శాస్త్రి దుర్గామాత మండపం వద్ద రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘటన జరిగిందని, కత్తిపోట్లు కాదని – గాజు పెంకులతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘటన ప్రసార మాధ్యమాల్లో కత్తిపోట్లుగా ప్రింట్ మీడియాలో ప్రచురితం అయిందని, ఎలక్ట్రాన్ మీడియాలో టెలికాస్ట్ అయిందని, కామారెడ్డి ఏ ఎస్ పి బి చైతన్య రెడ్డి కామారెడ్డి డి.ఎస్.పి కార్యాలయంలో శనివారం 11 గంటల 30 నిమిషాలకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పూర్తి సమాచారం సేకరించాకే పాత్రికేయుల సమావేశం నిర్వహించామని ఆమె పాత్రికేయుల సూచించారు. కామారెడ్డి విద్యానగర్ కాలనీలో జరిగిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. కిరణ్ షాపుల్లా, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, ఏ ఎస్పీ చైతన్య రెడ్డిని ప్రశ్నించగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కామారెడ్డి డిఎస్పి పరిధిలో డాబాలు ఎక్కడైనా సిట్టింగు ఉన్నట్లయితే సమాచారం ఇవ్వాలని, సమాచారాన్ని గోప్యంగా ఉస్తామన్నారు. రాత్రి సమయాల్లో యువత గుంపులుగా ఉన్న, రాష్ డ్రైవింగ్ చేసిన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఎస్ ఆర్ గార్డెన్ వద్ద పట్టుకున్న గంజా, సిరిసిల్ల బైపాస్ రోడ్లు పట్టుకున్న గంజా పై పాత్రికేయులు వివరాలు అడగగా కేసు విచారణలో ఉన్నదని తెలిపారు తెలిపారు. రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో 13 గంజాయి ప్లాంటేషన్ పట్టుకున్నామని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పటి పాయింట్లలో యువత డ్రగ్స్ అలవాటు పడుతున్నారన ప్రశ్నలకు ఎస్ హెచ్ వో లు, ఎస్సైలు పర్యవేక్షిస్తారని అన్నారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై నరేష్ పోలీస్ సిబ్బంది తధాలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!