బీహార్ ఎన్నికల్లో శంకరాచార్య పోటీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు. గో రక్షణ, సనాతన సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా బెట్టియాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు. గోవును ‘జాతీయ మాత’గా ప్రకటించాలనే తమ డిమాండ్పై స్పష్టమైన స్పందన రాలేదని ఆయన ఆరోపించారు.


