*తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, మరమ్మతు పనుల పురోగతి గురించి మంగళవారం వివరించారు.
ఎమ్మెల్యే ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే పునరుద్ధరించాలని సీఎం ని అభ్యర్థించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.
అదనపు ఇందిరమ్మ ఇల్లు మంజూరు. వంటి అంశాలపై కూడా సవివరంగా చర్చ జరిగింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.


