బస్టాండ్ అవరణలో పారిశుధ్య పనులు పర్యవేక్షించిన : శానిటరీ ఇనస్పెక్టర్ సి హెచ్ రమణ రావు

చిలకలూరిపేట అక్టోబర్ 07 ( అఖండ భూమి న్యూస్) : స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవరణలో పారిశుధ్య పనులు మరియ పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియను మంగళవారం నాడు మున్సిపల్ శానిటరీ ఇనస్పెక్టర్ సిహెచ్ రమణారావు ఆధ్వర్యంలో చేపట్టరు. ఈ సందర్భంగా ఇనస్పెక్టర్ సిహెచ్ రమణారావు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న బారి వర్షాల కారణంగా ఏ.ఏం.జి.వెనుక వైపు రోడ్డుతో పాటు,ఆర్టీసీ బస్టాండ్ అవరణలో ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండి దుర్వాసన తో పాటుగా పిచ్చి చెట్లు వేపుగా పెరిగి విష కీటకాలు, దోమలు వృద్ధి చెంది బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అసౌకర్య వాతావరణం నేల కొనడంతో .ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రాక్టర్లు. జెసిబి తో బస్టాండ్ అవరణలో పిచ్చి చెట్లు తొలగించి, పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామని.అదే విధముగా వర్షపు నీరు గుంటలలో నిల్వ లేకుండా ఉండేందుకు గుంటలలో డస్ట్ వేసి నింపుతున్నామని తెలిపారు


