జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో గత ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థులు జాగృతి లో చేరిక…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వం లో కామారెడ్డి జిల్లా నుండి కామారెడ్డి నియోజకవర్గం నుండి బి ఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీచేసిన అభ్యర్థి సురేష్ గౌడ్ , ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీచేసిన అభ్యర్థి తలారి బాలరాజ్ ,బీజేపీ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ గురువారం హైదరాబాద్ తెలంగాణా జాగృతి రాష్ట్ర కార్యాలయం లో జాగృతి పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనచారి, కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నరేష్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.


