జాతీయ ఆహార నూనెగింజల పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. 

జాతీయ ఆహార నూనెగింజల పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

వెల్దుర్తి అక్టోబర్ 09 (అఖండ భూమి వెబ్ న్యూస్) :

రైతులు జాతీయ ఆహార నూనె గింజల పథకాన్ని చదివినయోగం చేసుకోవాలని వేరుశనగ విత్తనాలను జిల్లా వ్యవసాయ అధికారిణి ఎల్ పి.వరలక్ష్మి రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఉచిత విశిష్ట వేరుశనగ విత్తనాలను బుధవారం రామళ్లకోట గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ ఆహార నూనెగింజల పథకము – వాల్యూ చైన్ క్లస్టర్ లో భాగంగా శ్రీ నల్లారెడ్డి స్వామి రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యములో నీటి వసతి కలిగిన రైతులకు ఉచితంగా విశిష్ట (టీసీజీయస్ 1694) వేరుశనగ విత్తనాలను జిల్లా వ్యవసాయ అధికారిణి ఎల్ పి.వరలక్ష్మి రైతులకు పంపిణీ చేయడం జరిగినది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేరుశనగా పంటలో రైతులు తీసుకోవలసిన మెలుకువలు గురించి ఏ డి ఏ పత్తికొండ  రైతులకు వివరించారు. రామళ్ళకోట గ్రామంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది చేసిన పంట నమోదు వివరాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయటం జరిగినది. రైతులందరూ పంట నమోదుని తప్పనిసరిగా చేపించుకోవాల్సిందిగా కోరడమైనది. పంట నమోదు చేసుకొన్న రైతులకు మాత్రమే వ్యవసాయ రాయితీ ఫలాలు అందుతాయన్నారు

రాయితీ పై శనగ విత్తనాలు

బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో రాయితీపై శనగ విత్తనాన్ని అవసరమైన రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి గారి చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగినది. రాయితీ పోగా క్వింటానికి రూ 5850/- రైతులు చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. జిల్లాలో అన్ని గ్రామాలలోని రైతు సేవా కేంద్రములలో శనగ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. కావలసిన రైతు సోదరులు గ్రామామూలోని రైతు సేవా కేంద్రమును సంప్రదించి విత్తనాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పిఎల్ వరలక్ష్మి పత్తికొండ ఏ డి ఏ మోహన్ విజయ్ కుమార్. రామళ్లకోట సర్పంచ్ నిర్మలమ్మ వ్యవసాయ అధికారి అక్బర్ బాషా చైర్మన్ వెంకటేశ్వర్లు ఏఈఓ అజయ్ భార్గవ్ రాయితులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!