కామారెడ్డి జిల్లాలో అధిక వర్షాల సంభవించిన నష్టాన్ని పరిశీలించిన కేంద్ర అధికారుల బృందం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో సంభవించిన అధిక వర్షాల వలన జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర అధికారుల బృందం సభ్యులు పీకే రాయ్ జాయింట్ సెక్రెటరీ హోమ్ అఫైర్స్ నేతృత్వంలో మహేష్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్పెండిచర్స్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, శ్రీనివాసు బైరి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ,శశి వర్ధన్ రెడ్డి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ ఆర్ సి ఎస్) ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ హైదరాబాద్ లు బుధవారం బిక్నూర్ మండల కేంద్రానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కేంద్ర బృందానికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముందుగా బిక్నూర్ మండల కేంద్రంలోని దెబ్బతిన్న దాస్నమ్మకుంటను పరిశీలించి బిక్నూర్ టు అంతంపల్లి రోడ్డులో దెబ్బతిన్న పంచాయతీ రోడ్డు, అంతంపల్లి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం దెబ్బతిన్న బిబిపేట్ ఆర్ అండ్ బి బ్రిడ్జి పరిశీలించారు.
బిబిపేట్ నుండి బయలుదేరి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకొని జిఆర్ కాలనీ వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని, అధిక వర్షాలతో దెబ్బతిన్న కామారెడ్డి ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ క్యాజ్ వే రోడ్డు ను పరిశీలించారు.
తర్వాత వరద నష్టం పై కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలో భారీ స్థాయిలో ఆగస్టు 26, 27, 28 తేదీలలో 3 రోజులలోనే సంవత్సరంలో కురిసే సగటు వర్షపాతం 983.4 ఎం ఎం లో 40 శాతంతో 339.8 ఎం ఎం వర్షపాతం జిల్లా వ్యాప్తంగా కురవడం మూలంగా రహదారులు, వంతెనలు, పంటలు , ఇరిగేషన్ ట్యాంకులు, విద్యుత్ లైన్ లు, స్తంభాలు, ఇండ్లు దెబ్బతిన్నాయని వాటిని తాత్కాలిక అత్యవసరంగా పునరుద్ధరణ చేపట్టామని కేంద్ర బృందానికి వివరించారు.
అనంతరం అధిక వరదలతో కొట్టుకుపోయిన లింగంపేట్ మండలం లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని, అధిక వర్షాలతో దెబ్బతిన్న ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల ఆర్ అండ్ బి బిడ్జినీ. అధిక వర్షాలతో దెబ్బతిన్న ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద పంట పొలాలను పరిశీలించారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న నాగిరెడ్డిపేట మండలం చినూర్వాడి గ్రామం వద్ద నేషనల్ హైవే 765 డి పక్కన వరి పంటను పరిశీలించారు. కేంద్ర బృందం పర్యటనలో చివరిగా అధిక వర్షాలతో దెబ్బతి నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యామ్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


