అరిషడ్వర్గాలు అంటే ఏమిటి..?
లెక్చరర్ శేషారావు వైద్య ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8,(అఖండ భూమి న్యూస్;
).
అరిషడ్వర్గాలు అంటే ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు’ అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలే. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం…*
*1. కామము: –* కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.
*2. క్రోధము: –* క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
*3. లోభము:–* లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.
*4. మోహము :-* తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించ లేకపోవడము.
*5. మదము: –* మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
*6. మాత్సర్యము: -* తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.
అరిషడ్వర్గాలు అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి.
.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


