స్థానిక సంస్థల ప్రతినిధుల తెలుసుకోవలిసిన చట్టం…

స్థానిక సంస్థల ప్రతినిధుల తెలుసుకోవలిసిన చట్టం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8 ,(అఖండ భూమి న్యూస్)73వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన సవరణలు ఒకటి ఇది గ్రామీణ స్థానిక సంస్థల కు రాజ్యాంగ హోదా కల్పించింది.

ఈ సవరణ ఎప్పుడు 24 1993 నుంచి అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగంలోని 11వ భాగాన్ని చేర్చి 20043 నుండి 243 0 వరకు నిబంధనలు ఉన్నాయి. అలాగే 11వ షెడ్యూల్ కూడా చేర్చబడింది ఇక్కడ మనం చర్చిస్తున్న అంశాలు ఏంటంటే అసలు ఈ చట్టం స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతవరకు అవగాహన ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబత్యం చేయడం గ్రామ స్వయంపాలనకు రాజ్యాంగ వృధా కల్పిస్తూ గ్రామస్థాయిలో పంచాయతీ మండల మద్యస్థయి సమితి , జిల్లా స్థాయి పరిషత్, ప్రతి గ్రామంలో ఓటు హక్కును కలిగిన వ్యక్తులందరిని కలుపుతూ గ్రామ సభను ఏర్పాటు చేయడం ప్రతి రాష్ట్రం పంచాయతీలను ఏర్పాటు చేయాలి. పంచాయతీలో పదవీకాలం ఐదు సంవత్సరాలు ఎస్టీ మహిళలకు ఒకటి పై మూడు వంతు రిజర్వేషన్ కల్పించబడింది. రిజర్వేషన్ సర్పంచి పదవులతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా వర్తిస్తుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీల ఆర్థిక మండల పై పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నివేదిక సమర్పించాలి. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు. పంచాయతీ రద్దయిన ఆరు నెలల్లో కొత్తగా ఎన్నికలు జరగాలి, గ్రామస్థాయి ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసింది. స్థానిక ప్రజలకు నిర్ణయాధికారాన్ని అందించింది. గ్రామాభివృద్ధికి పారదర్శకమైన ప్రజా ప్రతినిధి వ్యవస్థను సృష్టించింది 73వ సవరణ చట్టం భారతదేశంలో గ్రామీణ స్వయం పరిపాలనకు రాజ్యాంగ ఆధారం ఇచ్చింది. ఇది మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య ఆలోచనకు రూపమిచ్చిన సవరణగా పరిగణించబడుతుంది. రాజీవ్ గాంధీని

ఈ సందర్భంగా అభినందించవలిసిందే.అయితే

స్థానిక సంస్థల పై నియంత్రణ అధికారం

పేరుతో రాష్ట్రాలు ముఖ్యంగా అధికార పార్టీలు రాజకీయ అధికారాన్ని అస్త గతం చేసుకోవడం కొరకు స్థానిక సంస్థలు అధికారాలను నిర్వీర్యం

చేస్తున్నాయి. పదవి కాలం ముగిసిన 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించుటలో జాప్యం ఎందుకు. చాలా మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఈ చట్టాలపట్ల అవగాహన ఉందా అంటే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. అందుకే

పోటీదారులు ఈ చట్టాలు మీ హక్కుల అవగాహన అవసరం.

Akhand Bhoomi News

error: Content is protected !!