2014 కటౌట్ డేట్ తొలగించి బీడీ కార్మికులందరికీ కొత్త బీడీ పెన్షన్లు రూ :4016/_మంజూరు చేయాలి చేయాలి…

*2014 కటౌట్ డేట్ తొలగించి బీడీ కార్మికులందరికీ కొత్త బీడీ పెన్షన్లు రూ :4016/_మంజూరు చేయాలి చేయాలి…

*ఆల్రెడీ బీడీ పింఛన్లు రూ:2016 వస్తున్న కార్మికులకు అందరికీ ప్రభుత్వ హామీ ప్రకారం రూ :4016 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి..

*ప్యాకింగ్ స్టాఫ్ చాటన్ టేకేదారులకు కూడా అర్హులైన వాళ్లందరికీ బీడీ పెన్షన్లు ఇవ్వాలి…

*సీతక్క ఈనెల 11న ఉమ్మడి జిల్లా పర్యటన సందర్భంలో ఖచ్చితమైన ప్రకటన చేయాలి బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 9 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కందుకూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ. బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవనభృతి 2016 ను 2014 సంవత్సరం వరకు కట్ ఆఫ్ తేదీని ఉపసంహరించుకొని బీడీ కార్మికులందరికీ ఇవ్వాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చినటువంటి హామీని ₹4016 జీవనభృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈనెల 11వ తేదీన మంత్రి సీతక్క గారు ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ 4016 జీవనభృతిని తక్షణమే అమలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను ఏకం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలను నిరసనలు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కర్రోల సత్యం ,జిల్లా కమిటీ సభ్యులు కన్న ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!