*జిల్లాస్థాయి వాలీబాల్ జట్టుకు మైనారిటీ విద్యార్థులు ఎంపిక..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 9 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాల ఎల్లారెడ్డికి చెందిన నలుగురు విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రఫత్ తెలిపారు. గురువారం గాంధారి మండలం పెట్ సంగెం గ్రామంలో నిర్వహించిన ఎంపిక పోటీలో చక్కటి ప్రదర్శన చూపారన్నారు. అక్రమ్ అండర్ 14 విభాగంలో, షేక్ అయాన్ ప్రణదీప్ గౌడ్, మహమ్మద్ అనాస్ లు అండర్ 17 విభాగంలో ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులతో పాటు పిఈటి జ్ఞానేశ్వర్ ను ప్రిన్సిపల్ రఫత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలరాజ్, మంజూర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ దత్తాత్రేయ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


