బీసీలకు రిజర్వేషన్ దక్కెవరకు పోరాటం ఆగదు
బెల్లంపల్లి అక్టోబర్ 10(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీసీల హక్కుల కోసం గళమెత్తిన నేతలు”బెల్లంపల్లిలో బీసీ సంఘాలు,నాయకులు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.“మేమెంతో మాకు అంతే” అనే నినాదంతో జరిగిన సమావేశంలో,బీసీలకు న్యాయబద్ధమైన హక్కులు ఇవ్వాలంటూ గళమెత్తారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ..స్థానిక సంస్థల్లో అమల్లో ఉన్న 42 శాతం రిజర్వేషన్‌ను ప్రభుత్వం కొనసాగించాలి అని డిమాండ్ చేశారు.
ఒకవేళ రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తినా,రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల్లో కూడా బీసీలకు అదే స్థాయిలో రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు.దేశంలో బీసీలు 60 శాతం ఉన్నా,రిజర్వేషన్ మాత్రం 27 శాతం మాత్రమే ఉంది.బీసీలకు రాజకీయ రిజర్వేషన్ బిల్లు తక్షణం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.నాయకులు మహిళల రిజర్వేషన్ బిల్లు తరహాలోనే బీసీల బిల్లు కూడా తక్షణం తీసుకురావాలని కోరారు.
రాచరికాలు పోయినా ప్రజాస్వామ్యంలో బీసీలకు న్యాయం జరగడం లేదు,అని నేతలు వ్యాఖ్యానించారు.రాజకీయ పార్టీలన్నీ స్పందించాలని,న్యాయపరమైన రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



