మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ నోటీసులు అందుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు..
అవినాష్ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 160 కింద అవినాష్కు నిన్న నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. 20 రోజుల తర్వాత మరోసారి ఇవాళ అవినాష్ సీబీఐ ఎదుటకు వెళ్లనున్నారు.
మరోవైపు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై గత నెల 25వ తేదీన సీబీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్‌లో పలు అభియోగాలను, ఆధారాలను.. సీబీఐ వెల్లడించింది. అరెస్ట్ చేయకుండా కొన్నిరోజులు ఆపాలని అవినాష్‌రెడ్డి న్యాయవాదులు అభ్యర్థించినా.. సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయినప్పటికీ 20 రోజుల పాటు సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డి జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.



