పది నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను మోడీ నేరుగా చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు..
దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో పీఎం రోజ్ గార్ మేళను మోడీ సర్కార్ నిర్వహించనుందని వెల్లడించారు. ఇవాళ పిఎం రోజ్ గార్ మేళలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం రోజ్ గార్ మేళలో మోడీ పాల్గొననున్నారు. ఇక హైదరాబాద్ లో పీఎం రోజ్ గార్ మేళలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రిక్రూట్ అయిన 71 వేల మందికి పీఎం రోజ్ గార్ మేళలో నియామక పత్రాలు జారీ కానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అనంతరం 232 మందికి నియామక పత్రాలను కిషన్ రెడ్డి అందజేసారు..



