బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కేంద్ర ప్రభుత్వమే..!

*బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కేంద్ర ప్రభుత్వమే..!

 

జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..

*బీసీ బందులో పాల్గొన్న సిపిఎం నాయకులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 18 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం జరిగిన రాష్ట్రవ్యాప్త బందులో శనివారం సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రభుత్వం జీవోను తీసుకొచ్చి గవర్నర్ కు పంపిన పక్కన పెట్టడం కేంద్ర సర్కారుది పని అని అన్నారు. అదేవిధంగా పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నాకాని అక్కడ చేర్చకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణలో మాత్రం బీసీలకు సపోర్ట్ చేస్తూ బందులో పాల్గొనడం శోచనీయమని అన్నారు. బీసీల పట్ల బిజెపి ద్వంద వైఖరి ఆవలంబిస్తూ మోసం చేస్తుందని అన్నారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ప్రకారం ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నా కానీ కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మళ్లీ ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మాట్లాడుతున్నాడని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయో కూడా ఎమ్మెల్యే గారికి తెలవకపోవడం అలాంటి వ్యక్తిని కామారెడ్డి ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ బీసీలను అవమాన పరుస్తూ రిజర్వేషన్లు ఇచ్చేది లేదు ఒక్క తెలంగాణలో ఇస్తే దేశమంతా అడుగుతారు అని మాట్లాడడం సిగ్గుచేటనే విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతి రామ్ నాయక్ జిల్లా కమిటీ సభ్యులు ముదాo అరుణ్, నాయకులు మోహన్ ,సత్యం ,మంద శీను, దశరథ్, రాహుల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!