పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

*పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

*రాష్ట్రంలో మొదటిసారిగా 428 యూనిట్ల రక్తాన్ని సేకరించిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 18 (అఖండ భూమి న్యూస్);

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగిందని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం యొక్క ఉద్దేశం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడాలని మరియు పోలీసు అమరవీరుల త్యాగాలను తెలియజేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని,రక్తదానం చేసిన వారందరికీ హెల్మెట్లను అందజేశామని రక్తదానం పైన అవగాహననే కాకుండా,ట్రాఫిక్ నిబంధనలను పైన అవగాహన కల్పించడం జరిగింది.దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 428 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రక్తాన్ని ఏ పోలీస్ స్టేషన్లో సేకరించడం జరగలేదని ఇదే ప్రధమమని,దీనికి ఎంతగానో సహకరించిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్ కు,పోలీసు సిబ్బందికి,హెల్మెట్ల ను,అన్నదానానికి సహకరించిన దాతలకు కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు పర్శ వెంకటరమణ, ఐవిఎఫ్ యువజన విభాగం నాయకులు శైలేందర్ లు పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!