బందులో భారీ బీసీ ర్యాలీ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 18 (అఖండ భూమి న్యూస్);
42% బిసి రిజర్వేషన్ అడ్డుకున్నందుకు నిరసన వ్యక్తం చేస్తూ శనివారం మండల కేంద్రంలో బీసీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బిసి జేఏసీ అధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్ ఆధ్వర్యంలో బిసి రాష్ట్ర బంద్ పిలుపుమేరకు దోమకొండలో సంపూర్ణ బందును పాటించారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు, ఐక్యమై మహాత్మా గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా శివరాం మందిర్ రోడ్ అంగడి బజార్ బురుజు ఊరడమ్మ పలుకు గడ్డ మసీదు రోడ్ ల మీదుగా బైకులపై భారీ ర్యాలీ నిర్వహించారు. 42 శాతం రిజర్వేషన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు
తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించాలి
తమిళనాడు రాష్ట్ర తరహాలో తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద నాయకులు ప్రసంగించారు. 42 శాతం రిజర్వేషన్ను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు బిపి మండల్ కమిషన్ నివేదిక ప్రకారం 56% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లు లేకపోతే పార్టీలు ప్రభుత్వాలు మనం కూడా సాగించలేవని ఈ నిజం గ్రహించాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీ ప్రతినిధులు లేకపోవడం వల్లనే దశాబ్దాలుగా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అబ్రబోయిన స్వామి ,తీగల తిరుమల గౌడ్, కుంచాల శేఖర్,, ఐరని నరసయ్య ,తిరుపతి గౌడ్, సీతారాం మధు ,నాగారపు రాములు ,మల్లేష్ యాదవ్, శమీ ,పాలకుర్తి శేఖర్, బొమ్మరి శ్రీనివాస్, పున్న లక్ష్మణ్ ,నహీం, కుంచాల సత్యం ,బుర్ర రవి, గోపి ,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…
భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…


