అన్నింటికీ కారణం మానసిక ప్రశాంతత….

అన్నింటికీ కారణం మానసిక ప్రశాంతత….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 19. (అఖండ భూమి న్యూస్) : మానవ జీవితకాలం పెరిగేందుకు మానసిక ప్రశాంతత కారణం అని అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. మానవుని మనసు మసక బారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుండి బయటపడడానికి అనేక బలహీనతలు, దురాలవాట్లకు బలహీనులవుతున్నారని ఆ ఆధ్యాయంలో స్పష్టం అయ్యింది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్యులు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, జీవనశైలిని సరిదిద్దీపనలో పడ్డారు అని ఆ అధ్యయనంలో తేలింది. అందుకే డయాబెటిక్, బిపి ఒకటి నిరంతర అనారోగ్య అంశాలకు వైద్యులు వైద్యం ఇచ్చే పద్ధతిని మార్చుకున్నారని స్పష్టం అయ్యింది. ఇదివరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాలను నిరభ్యంతరంగా తినచ్చని వైద్యులు సూచించడం గొప్ప విషయం. పొద్దుటే ఉదయం కాలినడక వెళ్లేవారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమని వైద్యులు చెబుతున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయొచ్చని నిరభ్యంతరంగా తెలుపుతున్నారు. కొందరు ఉదయం కాలినడక ఇష్టపడితే మరి కొందరు జింకు వెళ్లాలనుకోవడం, మరికొందరు రిస్క్ వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టెయిర్ కేస్ వాక్ చేయాలనుకుంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది. అందుకనే వైద్యులు పేషంట్ల ఇష్టానికి విడిచిపెట్టి, ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీధి వైఖరి ఇలా మారడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగు చూస్తున్న అంశాలే కారణం అని స్పష్టం అయ్యింది. ఇలా వెళ్లడైనా అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. ఇందులో పాల్గొన్న సైంటిస్టులు చెబుతున్న విషయాలను పరిశీలిద్దాం….

 

మానసిక ఒత్తిడి వల్లనే గ్యాస్ సమస్య వస్తుందని స్పష్టం చేశారు. కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి. ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట. కేవలం మానసిక ఒత్తిడి వల్లనే ఎక్కువగా వస్తుందని స్పష్టం చేశారు. ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోలేని వారిలోనే అధిక రక్తపోటు (బిపి) ఎక్కువగా వస్తుందని తేలింది. అతి బద్ధకం వల్లనే చెడు కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు తినే వారిలో కంటే అతి బద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు వారి అధ్యయనములో తేలింది. మధుమోహన్ సమస్య తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే అధిక స్వార్థం, మొండితనం ఉన్న వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో స్పష్టం అయ్యింది. అతి విచారం వల్ల అస్త్మా అధికం అని నిరూపణ అయింది. ప్రశాంతత లేకనే గుండె జబ్బులు అధికం అయ్యాయని తెలిపారు. ధమనుల్లో రక్తం ప్రసన్న లోపాలకు కంటే, ప్రశాంతత లోపం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయని మా అధ్యయనంలో స్పష్టం అయ్యింది, అందువల్లనే మనిషికి గుండె జబ్బులు అధికం అవుతున్నాయని తేలింది. మొత్తం మీద మానవ శరీరంలో వచ్చే సర్వరోగ మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్లు కాదని మానవుని జీవన జీవన విధానానికి ప్రధాన సంబంధం అని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం 50 శాతం ఆధ్యాత్మికత లోపం వల్ల రాగా 25 శాతం మానసిక కారణాల వలన అనారోగ్యాలకు గురవుతున్నారు. 15% సామాజిక, స్నేహ బాంధవ్యాల లోపం వలన రాగా 10% శారీరక కారణాల వల్ల రోగాలు వస్తున్నాయని స్పష్టం అయ్యింది. కడుపు మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడే వారి కన్నా, జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సింది స్వార్థం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం వంటి వ్యతిరేక భావాలను మన నుండి వదిలించుకోవాలి. కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్థం, స్నేహభావం, సేవా భావం, కృతజ్ఞత, హస్య ప్రియత్వం, సంతోషం, సానుకూల దృక్పథాన్ని పెంచుకొని మన జీవన ప్రమాణాలను పెంపొందించుకోవచ్చునని సూచించారు….

Akhand Bhoomi News

error: Content is protected !!