పెన్సిల్ నుండ మనం ఏమి నేర్చుకోవచ్చు ..!
(పెన్సిల్ నుండి ప్రేరణ కథ) కవి,లెక్చరర్ ఉమాశేషారావ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 19 (అఖండ భూమి న్యూస్) : ఒకసారి ఒక చిన్నపిల్లాడు, తన అమ్మమ్మ ఉత్తరం వ్రాయడం గమనిస్తూ ఉన్నాడు.
కుతూహలంతో, “అమ్మమ్మా, ఏం రాస్తున్నావు? ఏదైనా ఆసక్తికరమైనదా? నా గురించి రాస్తున్నావా?” అని అడిగాడు. అమ్మమ్మ వ్రాయడం ఆపి, మనవడి వైపు తిరిగి, “నేను నీ గురించే వ్రాస్తున్నాను, నాయనా, కానీ వ్రాసే పదాల కంటే ముఖ్యమైనది, నేను వ్రాయడానికి వాడుతున్న ఈ పెన్సిల్. ఈ పెన్సిల్ నుండి మనం నేర్చుకోగల పాఠాలను అమలు చేస్తూనువ్వుఎదగాలని నేను ఆశిస్తున్నాను”, అంది. ఆశ్చర్యంతో, ఆ అబ్బాయి అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, కాసేపు పెన్సిల్ ని నిశితంగా పరిశీలించిన తర్వాత, “ఈ పెన్సిల్ నుండి పాఠాలా? కానీ ఇందులో ప్రత్యేకంగా ఏమీ అని పించడం లేదు, అమ్మమ్మా పెన్సిల్ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?” అనడిగాడు.
అమ్మమ్మ సమాధానమిస్తూ, “అది నువ్వు వస్తువులను ఎలా చూస్తావు అనేదానిపై ఆధారపడి ఉంటుంది, నాయనా. ఈ పెన్సిల్ లో ఏడు లక్షణాలు ఉన్నాయి, వాటిని నువ్వు జీవితంలో పొందుపరచుకోగలిగితే, అది ఎప్పటికి నీతో, చుట్టుపక్కల పరిస్థితులతో ప్రశాంతంగా ఉండే ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది!” అంటూ ఆ ఏడు లక్షణాలను ఇలా వివరించింది.1. మొదటి లక్షణం:- “`“ఈ పెన్సిల్ లాగానే, మనమందరం జీవితంలో గొప్ప పనులు చేయగలం, అయితే మనల్ని మరింత ముందుకు నడిపించేలా ఒక చేయి ఎల్లవేళలా మనకు వెన్నుదన్నుగా ఉంటుందని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వెనకాలే ఉండి పని చేయిస్తూ, మన జీవితాన్ని కొనసాగించడంలో సహాయం పడే ఆ చేతిని మనం ‘భగవంతుడు’ అని పిలుస్తాం.”“2. రెండవ లక్షణం:- “`అప్పుడప్పుడు, మనం మన పెన్సిల్ కొనను పదును పెడుతూ ఉంటాం. ఇది మొదట పెన్సిల్ ను కొంచెం బాధించినా, తరువాత మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది.అదేవిధంగా, కష్ట సమయాలు జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి, ఇది మన అంతర్గత అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, మంచి మానవుడిగా మనం మారడానికి మనకు సహాయపడతాయి.”. మూడవ లక్షణం:- “`
”మన తప్పులను సరిదిద్దుకోవడానికి పెన్సిల్ మనకు అవకాశం ఇస్తుంది. మనం వ్రాసే తప్పులను సరిదిద్దడానికి మనం ఎల్లప్పుడూ ఎరేజర్ ను ఉపయోగించవచ్చు.
తప్పులు చేయడం చెడ్డ విషయం కాదు, కానీ చాలా ముఖ్యమైనది ఏమిటంటే, ఆ తప్పులను సరిదిద్దుకోవడం, జీవితంలో ఎన్నడూ ఆ తప్పులను పునరావృతం చేయకుండా ఉండడం. బదులుగా, చేసిన తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగగలగాలి.”4. నాలుగవ లక్షణం:-బయటికి ఎంత గొప్పగా కనిపించినా లోపల ఉన్న ములుకు వ్రాయకపోతే, పెన్సిల్ యొక్క ఉపయోగం లేదు!
అలాగే మన బాహ్య రూపం మన అసలైన గుర్తింపు కాదు. మన నిజమైన గుర్తింపు మన అంతర్గత రూపాన్ని బట్టి, మనం మనుషులుగా లోపల నుండి ఎలా ఉన్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది. అంతర్గత సౌందర్యం ఎల్లప్పుడూ సర్వోన్నతమైనదే!” ఐదవ లక్షణం:- “`
“ఒక పెన్సిల్ వ్రాసిన తర్వాత తన గుర్తును వదిలివేస్తుంది, అది కొన్ని కోట్లమంది ప్రజలను ప్రేరేపించగలదు, వారి జీవితాలను మార్చగలదు!అలాగే, మన జీవితంలో మనం చేసే ఎంపికలు, మన జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ కొన్ని గుర్తులను వదులుతాయి. అలాగే మన ఆలోచనల, చర్యల రూపంలో మనం గుర్తులను వదులుతాం. మనం వాస్తవంగా ఎవరో, అవి నిర్వచిస్తాయి.”
ఆరవ లక్షణం:-“ఉపయోగించిన ప్రతీసారీ పెన్సిల్ చిన్నగా అయిపోతూఉంటుంది, అలాగే జీవితం కూడా! మనకు ఇంకా సమయం ఉండగానే దాన్ని ఎందుకు ఎక్కువగా ఉపయోగించుకోకూడదు? జీవితంలో మన నిజమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, దానిని నెరవేర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు?”చివరిగా, 7. పెన్సిల్ ఏడవ లక్షణం:- “`తన జీవితం అంతం అయ్యే వరకు పెన్సిల్ వ్రాస్తుంది. ఒక పెన్సిల్ ఒక్క రోజులో పూర్తి అయిపోవచ్చు, కానీ తాను వ్రాసినది చేసిన పని మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది!”“మన చివరి రోజు వరకు మనం పెన్సిల్ లాగా ఉపయోగకరంగా, ప్రయోజనక రంగా ఉండగలమా?” అంటూ బామ్మ చిరునవ్వునవ్వుతూ,తనమనవడుఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలిపెట్టింది.ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం, నైతిక పాఠాలు నేర్చుకునే స్థలం కూడా.ఒక పెన్సిల్ ఇంత ఆదర్శంగా ఉంటేప్రాణం ఉన్న జీవులం
ఎంత ఆదర్శంగా ఉండాలి.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



