రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ..!

.*రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ..!

*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 22 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మంజుల కు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అన్నేబోయిన ప్రశాంత్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం పట్ల అవగాహనను పెంపొందించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ప్రకారం రక్తదానం చేసే వారికి గుండె జబ్బు క్యాన్సర్ కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలియజేయడం జరిగిందని రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడమే కాకుండా మన ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చునని అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు,రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతకు అభినందనలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!