అయ్యప్ప ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి ఉంటుంది:
జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 22: (అకాండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నిర్మించిన శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, భక్తునిగా తన వంతు కృషి చేస్తానని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన అయ్యప్ప ఆలయానికి మరుగుదొడ్లు, బాత్ రూమ్ ల నిర్మాణానికి భూమి పూజ చేసి, మొదటి విడతగా రూ.50 వేలు ఆలయ కమిటీ చైర్మన్ పద్మ శ్రీకాంత్ కు అందజేశారు. అన్నదానం కార్యక్రమానికి కూడా తన తోడ్పాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆనంతరం అయన అయ్యప్ప ఆలయంలో ప్రతీ బుధవారం జరిగే అన్నప్రసదా వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి అన్నప్రసాదం ఆలయ పూజారి శ్రీనివాస్ రావుతో పెట్టించి పూజలు చేసి, స్వయంగా భక్తులకు ఆయనే వడించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మెన్ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్, ప్రతినిధులు గురుస్వామి చంద్రం, ఆకుల కిష్టయ్య, పప్పు వెంకటేశం, ప్యాలల రాములు, నవీన్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు, బీజేపీ సీనియర్ నేతలు దేవేందర్, బాలకిషన్, రాజేశ్వర్, కాశినాథ్, ప్రసాద్, అల్లం పండరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


