తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలి…

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వా న్ పిలుపు ..
*ఈనెల 25 తో ముగియనున్న సర్వే..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 21 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశిష్ అన్నారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం
“తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుంది.
ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు , సూచనలను అందించాల్సింగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియ చేశారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


