దేవాలయాలు అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది..!

దేవాలయాలు అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది..!

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 22 (అఖండ భూమి న్యూస్);

దేవాలయాల అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ హెడ్కర్ లు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా దిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ సిద్ధి రామేశ్వర ఆలయం కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరై
. ఆలయ కమిటీ అధ్యక్షుడు తాటిపాముల లింబాద్రి, ఉపాధ్యక్షుడు అందే దయాకర్ రెడ్డి, డైరెక్టర్లు సింగారపు నరసమ్మ, నీల అంజయ్య, అడుగు అమృత, సామ సంతోష్ రెడ్డి, ముత్తన్న, ఓట్ల కిష్టయ్య, నాగార్తి రమేష్ రెడ్డి, గుడిసె నారాయణ, లుంగీ బాగయ్య, మోకాళ్ళ బాపురెడ్డి, చికోటి ప్రభాకర్, అక్కు కార్తీక్ లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ. బిక్కనూరు సిద్ధ రామేశ్వర ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఈ ఆలయం కామారెడ్డి నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ అభివృద్ధి వారు నిజాయితీగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆలయం కు నా వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. పదిహేను లక్షల నిధులతో ఆలయం మరింత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్టి ఆలయ అభివృద్ధికి నా వంతుగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆలయం అభివృద్ధికి ప్రతి ఒక్కరికి తోడ్పాటు ఉండాలని ప్రతి ఒక్కరి సహకారంతోనే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి కోసం ఆలయ కమిటీ వారు పక్కా ప్రణాళికతో ఆలయం అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, ఎడ్ల రాజు రెడ్డి, భీమ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, లక్ష్మీ రాజా గౌడ్, బలియాల సుదర్శన్, గోనె శ్రీనివాస్, దేవరాజ్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి, లింగారెడ్డి, ఐరన్ సందీప్, గంగా ప్రసాద్, నరసింహారెడ్డి, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, గుడుగుల శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!