నందివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన* *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన…

*నందివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన* *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన…

**మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..

**కష్టపడి చదివి పదవ తరగతి లో మంచి ఫలితాలు సాధించాలి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 22 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం , నందివాడ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం సందర్శించారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత అయ్యేలా సన్నద్ధం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు .
అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచేలా చూడాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించి చదువులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆన్నారు

10 వ తరగతిలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని సిలబస్ ఎంత వరకు పూర్తయిందని , తదితర ప్రధానో పాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
10 వ తరగతి విద్యార్థుల చేత బోర్డు పై ఉన్న పదాలను చదివించారు. విద్యార్థులు అందరూ వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని 100% ఉత్తీర్ణత సాధించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు
అనంతరం MDM (మధ్యాహ్న భోజనం) ను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనీ, నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ఆహారం అందించాలని, వంట చేసేటప్పుడు,వడ్డించేటప్పుడు శుభ్రత పాటించాలని ఆన్నారు.

పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అదే విధంగా స్లాబ్ పై పేరుకుపోయిన చెత్త ను ఎప్పటికప్పుడు సానిటేషన్ వర్కర్సతో శుభ్రం చేయించాలని పేర్కొన్నారు

కలెక్టర్ వెంట డీఈవో రాజు, ఎంఈఓ రామస్వామి, ఎమ్మార్వో శ్వేత, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ , ఎంపీ డి ఓ సవిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!